భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వం నేతలు గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదులు 27 మంది భారతీయులను అత్యంత కిరాతకంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీంతో మోదీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు బుద్ధి చెప్పారన్నారు.