జీవనోపాదులను మెరుగుపరచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆధ్వర్యంలో "హోం ట్రయాంగిల్ యాప్" సంస్థతో కలిసి సేవలందించేందుకు సర్వీస్ ప్రొవైడర్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్లు నగర కమిషనర్ పి నరసింహ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పట్టణాల్లోని గృహాల్లో ఎలక్ట్రికల్ సర్వీసింగ్,వంటి గృహ సంబంధిత సేవలు అందించేందుకు వీలుగా సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి, శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.