చిత్తూరు జిల్లాలో ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని డీఆర్ఓ మోహన్ కుమార్ మంగళవారం పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని డీఆర్ఓ ఛాంబర్ లో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. మరోవైపు విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సర్వీస్ సదుపాయం కల్పించాలని డిఆర్ఓ కోరారు.