చిత్తూరు: ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవంపై ర్యాలీ

53చూసినవారు
చిత్తూరు నగర పరిధిలోని మురంకంబట్టు అర్బన్ హెల్త్ సెంటర్ లో మంగళవారం "ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం అని డాక్టర్ ఆశ అన్నారు. డిఎమ్.హెచ్.ఓ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ ఆశ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలి, ప్రవర్తనతో క్యాన్సర్ ను అరికట్టవచ్చు అన్నారు. ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్