చిత్తూరు జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. మూడు స్పెల్స్‌లో జరిగే ప్రాక్టికల్స్‌లో 12,311మంది ఒకేషనల్, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు పాల్గొననున్నారు. ఫస్ట్ ఇయర్ లో 1908 మంది, సెంకండియర్ లో 2034 మంది హాజరు కానున్నారు. ఈనెల 9 వరకు 25 కళాశాలల్లో వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, ఆపై 20వ తేదీ వరకు 58 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.