స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా చిత్తూరు నగరంలోని అంబేడ్కర్ భవన్ వద్ద ఉచిత ఓఆర్ఎస్ కేంద్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. దీనిని మేయర్ ఆముద , కమిషనర్ నరసింహ ప్రసాద్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే ట్రాక్ వద్ద గేటు పడినప్పుడు వాహనదారులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు షెడ్స్ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు 'బీట్ ది హీట్' కార్యక్రమంపై అవగాహన కల్పించారు.