జీడి నెల్లూరు: గంగమ్మ ఆలయంలో చోరీ

59చూసినవారు
జీడి నెల్లూరు: గంగమ్మ ఆలయంలో చోరీ
జీడి నెల్లూరు నియోజక వర్గం, పాలసముద్రం మండలం, కొత్తూరు గంగమ్మ ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు ఆలయ గర్భగుడి తలుపులను ధ్వంసం చేసి, సీసీ కెమెరా వైర్లను కట్ చేసి ఆలయంలో ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహం, మైక్ సెట్ , హుండీలోని నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్