చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, శ్రీరంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట ప్రీమియం క్రికెట్ టోర్నమెంటు చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ఆడే వారిని కలిసి బాగా ఆడాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు.