జీడి నెల్లూరు నెల్లూరు మండలంలోని నీవానది సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు అగరమంగళం నుంచి యాదమరికి పెళ్లిన వెళ్తున్న ఓ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరూ ఒకే గ్రామానికి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.