గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో వీధి కుక్కలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుక్కల బెడద నుండి తమను కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు. నిత్యం రోడ్డుపై తిరుగుతూ ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి శునకాల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.