గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని నీవా నది సమీపంలో శనివారం రాత్రి ఆటోను లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలోని అత్యవసర విభాగం అంతా కూడా గాయపడినవారి బంధువుల రోదనలతో మిన్నంటింది.