పెనుమూరు: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

51చూసినవారు
పెనుమూరు: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
రైతులకు విక్రయించే ఎరువులను నిర్ణీత ధరల కన్నా అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని పుంగనూరు ఏడీఏ శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరులోని పలు ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ధరల పట్టికలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులో నమోదు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్