పెనుమూరు మండలంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం శాతంభాకంలో సంపద కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి ఎరువులు తయారు చేయాలనీ సూచించారు. అలాగే సంపద కేంద్రం ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమం లో ఈఓపీఆర్డీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.