జీడి నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలో నిర్వహించిన గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను ఏమి చేశారని ట్రైన్ కలెక్టర్ హిమవంశీ తహశీల్దార్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన పెనుమూరులో వీఆర్వో సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో పిజిఆర్ఎస్ లొ వచ్చేటువంటి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం రీ సర్వే జరుగుతున్న నంజరపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే పనులపై ఆరా తీశారు.