విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోదిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓలు అరుణాచలం రెడ్డి, సబర్మతి అన్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం లో గురువారం స్టేట్ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ లను ఉపాధ్యాయులతో కలసి ఆవిష్కరించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడాలపై ఆసక్తి పెంపొందించేలా విద్యను బోదించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.