ఎస్ ఆర్ పురం: న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాము

75చూసినవారు
తన భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ తన భర్త శవం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే ఎస్ జీడి నెల్లూరు నియోజకవర్గం, పాతపాలెంకు చెందిన వెంకటేశ్ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తన భర్త మృతి చెంది రెండు రోజులవుతున్నా తమకు న్యాయం జరగలేదని వెంకటేశ్ భార్య బుధవారం వాపోయారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె పెట్రోల్ తొ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్