78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వం మైదానం ముస్తాబయింది. గురువారం ఉదయం 8: 35 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయి అని గూడూరు ఆర్డీఓ తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.