చిట్టమూరు మండలంలో బుధవారం గూడూరు శాసనసభ్యులు డా. పాశం సునీల్ కుమార్ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. ముందుగా టీ. డి. పి నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ చిట్టమూరు మండల పరిషత్ వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు.