నిమ్మధరలు తగ్గుముఖం కిలో రూ. 20 నుండి రూ. 50

64చూసినవారు
గూడూరు బాలాజీ లెమన్ మార్కెట్లో ఆదివారం నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం వరకూ కిలో నిమ్మకాయలు రూ. 40 నుండి 80 రూపాయల వరకూ ధర పలికింది. ఆదివారం ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. కిలో రూ. 20 నుండి 50 రూపాయల వరకు ధర పలికింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు అంటున్నారు. ధరలు తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్