చిట్టమూరు మండలంలో శనివారం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అల్లం బాబు, చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ నయీమ్ జనసైనికులతో కలిసి పర్యటించారు. ఆరూరు గ్రామస్తులతో మాట్లాడారు. చెరువుకట్ట మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. రాఘవారిపాలెంలో మంచినీటి సమస్య ఉందని ప్రజలు వినతిపత్రం సమర్పించారు. ఆయా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళతామని గ్రామస్తులకు జన సైనికులు భరోసా కల్పించారు.