ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలి: డీఈఓ

55చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలి: డీఈఓ
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు టీచర్లు కృషి చేయాలని తిరుపతి డీఈవో డాక్టర్ వి. శేఖర్ ఆదేశించారు. చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారి పాలెం జడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ ఎండీ. రవూఫ్, ఉపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్