చిట్టమూరులో బుధవారం టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. అన్నయ్య నాయుడు పార్క్ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొననున్నట్లు టీడీపీ గూడూరు క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ మల్లి తెలిపారు. పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, రైతు సేవా కేంద్ర ప్రారంభోత్సవం, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహ శంఖు స్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.