ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు విజయవాడను ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయార్థం కందుకూరు నియోజవర్గంలోని ప్రజా ప్రతినిధులు వరద సహాయార్థం రూ.1లక్ష డిడిని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి పూజకు బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఆర్థిక సహాయం అందించటం అభినందనీయమని తెలిపారు.