కుప్పంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

1062చూసినవారు
రంజాన్‌ పండగను గురువారం కుప్పంలో ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నూతన దుస్తులు ధరించి చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గతించిన తమ కుటుంబసభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మునిసిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ వద్దనున్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్