కుప్పం: పల్సర్ బైక్ పై వచ్చి పట్ట పగలు వరుస చోరీలు

68చూసినవారు
కుప్పం పట్టణంలో పట్టపగలు వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. పల్సర్ బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి దర్జాగా ఇళ్లలోకి చొరబడి వరుస చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని టీబీ రోడ్డులో వైసీపీ నేత, మాజీ రెస్కో సెంథిల్ ఇంట్లో బైక్ పై వచ్చిన వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసులు మంగళవారం నిర్ధారించారు. మరో రెండిళ్లలో సైతం ఇతనే చోరీలకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్