సీఎం చంద్రబాబు కుప్పం మున్సిపాలిటీలో పర్యటించనున్న ప్రదేశాలలో భద్రత ఏర్పాట్లను డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్, ఎస్సై నరేశ్, కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.