కుప్పం నియోజకవర్గంలో ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, అర్బన్ సీఐ శంకరయ్య సోమవారం తెలిపారు. ఈ ఘటనలో నిందితులతోపాటు తొమ్మిది లక్ష రూపాయల విలువచేసే 8 బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను తమిళనాడు క్రిష్ణగిరికి చెందిన సికిందర్, సేటు, హోసూర్కు చెందిన యారల్, షాదుల్లాగా గుర్తించారు.