కుప్పం మండలంలోని మల్లానూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసి ఉపాధ్యక్షులు పీఎస్ మునిరత్నం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.