కుప్పం పట్టణంలో మంగళవారం జరిగిన ఓ వివాహ వేడుకలకు హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. రాజమండ్రిలో జరిగే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు జరిగే అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు కుప్పం నుంచి విజయవాడకు రైలులో పయనమయ్యారు. ఈ సందర్భంగా కుప్పం రైల్వే స్టేషన్ లో అధికారులతో కాసేపు ముచ్చటించారు.