కుప్పంలో వెలసిన తిరుపతి గంగమ్మను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ చైర్మన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడ పిడి వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టిటిడి బోర్డు మెంబర్ శాంతారామ్, ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.