కుప్పం ఎం. ఎఫ్. సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసి వైస్ ఛైర్మన్ మునిరత్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడమే పథకం లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు.