సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంలో శనివారం స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టిసి వైస్ చైర్మన్ మునిరత్నం మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.