కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్డీవో శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ శుక్రవారం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. విపత్తుల సమయంలో ప్రజలు భయపడవద్దన్నారు. నివారణ చర్యలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కుప్పం సీఐలు శంకరయ్య, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.