కుప్పం ఏరియా ఆసుపత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ మంజూరు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో మూడునాళ్ల ముచ్చటగా ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగించి పక్కన పెట్టేశారు. మూడేళ్లకు పైగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది.