కుప్పం మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఒకేరోజు మూడిళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడగా, మరుసటి రోజు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. వరుస దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి పట్టణంలోని పలుచోట్ల సంచరించినట్లు బుధవారం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.