శాంతిపురం మండలంలోని డుంకుమానుపల్లి గ్రామంలోని 92/2 సర్వే నంబర్‌లోని 2. 08 సెంట్ల ప్రభుత్వ భూమిని పెద్ద బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని రక్షించాలని శనివారం వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.