కుప్పం నియోజకవర్గంలోని ఈడిగ కులస్థులకు సంబంధించి ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు. మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే ఇతర కులస్తులు నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి, టెండర్ వేయడానికి వచ్చారని ఈడిగ సంఘం నాయకులు శనివారం నిరసనకు దిగారు. ఈడిగలు మాత్రమే దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.