ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు మంగళవారం కుప్పంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ పార్టీ విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్, మైనార్టీ యువ నాయకులు మతీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.