కుప్పం పట్టణంలో చోరీ

51చూసినవారు
కుప్పం పట్టణంలో చోరీ
కుప్పం పట్టణంలోని సిరికల్చర్ కార్యాలయం సమీపంలో ఓ ఉపాధ్యాయుడు ఇంట్లో సోమవారం పట్టపగలే దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. బిరువా తాళాలు పగలగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారని బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సిఐ శంకరయ్య సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు‌. దొంగలు పట్టపగలే దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారని పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్