సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు కూరగాయల అంటుకట్టు విధానంపై, హైడ్రో ఫోనిక్స్ విధానంతో కూరగాయల పెంపకంపై జాతీయ స్థాయిలో మూడురోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 16 రాష్ట్రాల హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్రల ఉద్యాన శాఖ అధికారులు విచ్చేశారు.