కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కూరగాయల అంటుకట్టే విధానంపై రెండో రోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఇండో ఇజ్రాయిల్ కూరగాయలతో అంటుకట్టే విధానం, హైడ్రో ఫోనిక్స్ విధానంపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యానవన అధికారులకు ప్రాక్టికల్గా శిక్షణ ఇచ్చినట్లు గ్రీన్ ఆర్బిట్ అధినేత శ్రీనివాస్ పేర్కొన్నారు. 2 రోజులపాటు నిర్వహించిన జాతీయ సదస్సులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.