నగిరి నియోజకవర్గం, పుత్తూరులోని కార్వేటినగరం కూడలిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడి వర్ధంతిని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ కార్యాలయం గురువారం సాయంత్రం ఓ ప్రకటనలొ తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే హాజరుకానున్నట్లు చెప్పారు. ఉదయం 10: 30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.