నిండ్ర మండలం మేలంబాకం గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బాలకృష్ణమ రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.