నగరి: రేపు గ్రీవెన్స్ డే కార్యక్రమం

67చూసినవారు
నగరి: రేపు గ్రీవెన్స్ డే కార్యక్రమం
నగరిలో ప్రతి శనివారం ఎమ్మెల్యే గ్రీవెన్స్ డే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరిలోని టీడీపీ కార్యాలయంలో రేపటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నియోజకవర్గంలోని ప్రజలు ఎమ్మెల్యేకు నేరుగా సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్