అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరి సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ లకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోదండయ్య పేర్కొన్నారు.