నిండ్ర మండలంలో ఇవాళ ఉదయం మార్గశిర మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడ కొమ్ములు జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా మాడ వీధిలో ప్రదక్షణ చేపట్టారు. ప్రధాన ఆలయ ధర్మకర్త రవి స్వామి గురువులైన లోకేష్ శివకుమార్ తులసి భక్తులతో కలిసి గోవింద నామ స్మరణ చేశారు. కర్పూర నిరాజనాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.