శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సోమవారం సాయంత్రం వైభవంగా విగ్రహ ప్రతిష్ట గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు గురు రామచంద్ర శర్మ, వినాయకునికి పంచామృతాలతో అభిషేకము చేసి, పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక అలంకరణ చేశారు. దీప దూప నైవేద్యం అందజేశారు. గురువులైన లోకేష్ దాస్ బృందముతో భజనలు చేశారు. ఇందులో భాగంగా పట్టణం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు.