చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలం ఓరూరుపేటకు చెందిన టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని చంద్ర ప్రసాద్ తనయుడు గంధమనేని రాజేష్ శుక్రవారం సీఎం చంద్రబాబును అమరావతిలో మర్యాద
పూర్వకంగా కలిశారు. ఇటీవలే చంద్ర ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.