నగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తర్వాత ముమ్మరంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇదే కోవలో గురువారం నియోజకవర్గానికి చెందిన విజయపురం మండలం జగన్నాధపురం నుంచి పన్నూరు వరకు తారు రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. రోడ్డు పూర్తిగా మరమ్మతులకు గురి కావడంతో శరవేగంగా రోడ్డు పనులు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.