చిత్తూరు జిల్లా, నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల విస్తృత స్థాయి సమావేశం శనివారం ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ చిత్తూరు ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ఆశ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.